ప్రాజెక్ట్‌ స్త్రీధన్‌

ప్రాజెక్ట్‌ స్త్రీధన్‌

“ప్రాజెక్ట్‌ స్త్రీధన్‌” పేరు తో ఓ ప్రచారం ని “డీఎస్‌ఎమ్‌” అనే సంస్థ ప్రారంభించింది. పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి డీఎస్‌ఎమ్‌ పని చేస్తుంది. బంగారు ఆభరణాలకి సంబందించిన కమర్షియల్స్‌ యాడ్స్ కి విరుద్దంగా డీఎస్‌ఎమ్‌ సంస్థ యాడ్ ను రూపొందించింది.

భారత్లో ఉన్న స్త్రీలకు కావాల్సింది ఐరన్‌.. బంగారం కాదు అని వచ్చే ధనత్రయోదశికి బంగారు నగల మీద కాకుండా ఐరన్‌ మీద దృష్టి పెట్టండి అని యాడ్ ని తయారు చేసింది. ఐరన్‌ పుష్కలంగా దొరికే ఆహారాన్ని తింటూ ఇదే ఐరన్‌ అయితే నర నరాల్లో ప్రవహిస్తుంది అని గ్రామీణ, పట్టణ వాసులను ఉత్తేజ పరిచేలా యాడ్ ని చేసింది.

మన దేశంలో మహిళలకు ఐరన్‌ కావాల్సిన అవసరం చాలా ఉంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే పోయిన 2018 లో చేసిన సర్వే లో సగానికి సగం మహిళలు రక్తహీనత వల్ల బాధ పడుతున్నారు. ఆరోగ్య సంరక్షణకు శుభ ఆరంభం గా ప్రతిరోజు తినే ఆహారంలో ఐరన్‌ ఉండేలా చూస్కోవాలి.

.