16 నెలల తర్వాత మళ్లీ ఈ ఫుడ్‌ తిన్నా : సమంత

16 నెలల తర్వాత మళ్లీ ఈ ఫుడ్‌ తిన్నా : సమంత
Cinema News

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మూవీ లకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకుంది ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదనే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంది . ఇక తాను ఒప్పుకున్న మూవీ లను పూర్తిచేసుకుని ఇప్పుడు మొత్తం తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.

16 నెలల తర్వాత మళ్లీ ఈ  ఫుడ్‌ తిన్నా : సమంత
Samantha

అలా ఎంతో కష్టపడి డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు ఆహారం విషయంలో ఎంతో కఠినంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే సమంత తాజా పోస్ట్ చూస్తే ఆమె ఫుడ్ విషయంలో ఎంతో కష్టపడుతుందని అర్థం అవుతుంది . సామ్ పెట్టిన తాజా పోస్ట్ ప్రకారం….’16 నెలలుగా ఈ బ్రెడ్ ముక్కను ముట్టలేదు. ఫైనల్ గా ఇప్పుడు తింటున్నా’ అని చెప్పుకొచ్చింది . తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లలో ఈ పోస్ట్ పెట్టడంతో… పాపం ఎంత కష్టం వచ్చిందో సామ్ కి అని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.