ఓటీటీలోకి ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

ఓటీటీలోకి ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
Cinema News

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ఈయన మూస ధోరణిలో వెళ్లకుండా.. తన ప్రతి సినిమా కాస్త డిఫరెంట్​గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇటీవల ఆయన మామా మశ్చీంద్ర అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఈ నెల 6న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

ఓటీటీలోకి ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
Mama Machindra

ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఆ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. నటుడు హర్ష వర్ధన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. అజయ్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు లను పోషించారు.