అల్లరి నరేష్ న్యూ సినిమా కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్

అల్లరి నరేష్ న్యూ సినిమా కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్
Cinema News

హాస్య మూవీస్‌ బ్యానర్‌పై అల్లరి నరేశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి. కాగా దీనిని సుబ్బు తీస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మరోవైపు నేడు ఆయన నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. నరేష్ కెరీర్ 61వ మూవీగా రూపొందుతున్న దీనికి ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ నిర్ణయించారు. ఇక కొద్దిసేపటి క్రితం మూవీ టైటిల్ గ్లింప్స్ ని అనౌన్స్ చేశారు.

తన చుట్టుప్రక్కల ఇళ్ల వాళ్ళు అందరూ పెళ్లి ఎప్పుడు అంటూ హీరోని అడుగుతుండడం, అయితే అది పాన్ ఇండియన్ ప్రాబ్లమ్ అని, ఆ ఒక్కటి అడక్కు అని అంటూ అతడు అందరికీ సమాధానం ఇవ్వడం వంటి డైలాగ్స్ తో టైటిల్ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తో గతంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఇవివి ఒక సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు.

అల్లరి నరేష్ న్యూ సినిమా కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్
Allari Naresh ” Aa Okkati Adakku

మరి ఇది ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా ని అంకం మల్లి తెరకెక్కిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమా లో ఫరియా అబ్దుల్లా, అరియనా గ్లొరీ, వెన్నెల కిషోర్, హరితేజ, హర్ష చెముడు, జామీ లీవర్ తదితరులు నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మార్చి 22న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. త్వరలో ఈ మూవీ గురించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి..