Election Updates: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే

Election Updates: AICC chief Kharge will release the Congress manifesto today
Election Updates: AICC chief Kharge will release the Congress manifesto today

తెలంగాణ శాసనసభ సమరం కీలక దశకు చేరుకుంది. ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటనలపై ఫోకస్ చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈరోజు రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్​లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

-> బంగారు తల్లి పథకం కింద ఆర్థిక సాయం.. యువతుల పెళ్లికి రూ.లక్షతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల(తులం) బంగారం
-> రైతుల కోసం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు
-> ధరణి స్థానంలో భూమాత పోర్టల్
-> రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంటరుణ మాఫీ. ఏటా రూ.3 లక్షల వరకు వడ్డీలేని పంటరుణం.
-> అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ
-> ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ‘సీఎం ప్రజాదర్బార్‌’
-> విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం
-> తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ పింఛన్‌. ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. 250 చదరపు గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు.