Election Updates: వాలంటీర్లతో ‘నేను-నా బూత్ సిద్ధం’ సభకు జనాల సమీకరణ

Election Updates: Mobilization of people for 'Nenu-na booth saaraat' meeting with volunteers
Election Updates: Mobilization of people for 'Nenu-na booth saaraat' meeting with volunteers

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఈ నెల 10న ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే ‘సిద్ధం’ ముగింపు సభకు జనాన్ని సమీకరించేందుకు వాలంటీర్లను వైకాపా నాయకులు వినియోగించుకుంటున్నారు. వాలంటీర్లతో వైకాపా నేతలు బుధవారం ‘నేను- నా బూత్ సిద్ధం’ కార్యక్రమాన్ని బల్లికురవ మండలంలోని వల్లాపల్లి, కొప్పరపాలెం, అంబడిపూడి, వేమవరం గ్రామాల సచివాలయాల్లో నిర్వహించారు.

‘సిద్ధం’ సభకు జనాలను సమీకరించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. అంతే కాకుండా ఓటర్ల జాబితాను పరిశీలించి, వారి పరిధిలో ఉండే ఓటర్లతో ఎన్నికల్లోనూ వైకాపాకు ఓట్లు వేయించాలని కోరారు. వల్లాపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభించిన సచివాలయంలోని ఫర్నిచర్ను సైతం ఈ కార్యక్రమానికి వినియోగించడం చర్చనీయాంశమైంది. అంబడిపూడిలో వాలంటీర్లు ఓటర్ల జాబితాను పరిశీలించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.