Election Updates:ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణలో 144 సెక్షన్‌ అమలు

Election Updates: Section 144 will be implemented in Telangana from 5 pm today
Election Updates: Section 144 will be implemented in Telangana from 5 pm today

ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణలో 144 సెక్షన్‌ అమలు కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కీలక దశ ఇవాళ్టితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. బహిరంగసభలు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ్టితో మూగబోనుంది.

ఓవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. మరోవైపు మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు ఇలా రాష్ట్రంలో ప్రచారం జోష్​గా సాగింది. నేటి సాయంత్రం నుంచి సోషల్‌ మీడియాలోనూ ప్రకటనలకు అనుమతి లేదు. తెలంగాణ రాష్ట్రమంతటా పోలింగ్‌కు 48 గంటల ముందే 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌లో సోషల్‌ మీడియా, టీవీలో ప్రకటనలకు అనుమతి లేదు.