ఇంజినీరింగ్ సీట్లు 92 వేలు

Engineering seats ninety two thousand

రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 92 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే వరకు మరికొన్ని సీట్లు పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు యూనివర్సిటీల్లో కలిపి మొత్తం 181 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లు పూర్తయ్యాయి. దీంతో ఆ కాలేజీల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందులో జేఎన్టీయూహెచ్ పరిధిలో 157 కాలేజీల్లో 81,009 సీట్లు, కేయూ పరిధిలో ఎనిమిది కాలేజీల్లో 2,565 సీట్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఒక్క కాలేజీలో 180 సీట్లు, ఓయూ పరిధిలో 15 కాలేజీల్లో 8,180 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదిలో మొత్తం 96 వేల సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి నాలుగు వేల సీట్లు తగ్గాయని అధికారులు తెలిపారు. వీటిలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నారు.