తమిళ నటి ఇంట్లో దూరిన దుండగుడు…అలా చేయమని ?

చెన్నైలోని వడపళని వందడుగుల రహదారి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఓ టీవీలో ప్రసారం అవుతున్న రాజారాణి సీరియల్ నటి రితిక తన తండ్రితో కలిసి నివసిస్తోంది. గోబిచెట్టిపాళెయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి భరత్‌ గురువారం ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన రితిక తండ్రి సుబ్రహ్మణితో రితికను తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. రితికను తనకిచ్చి వివాహం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భరత్ ఆయనను బెదిరించాడు. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భరత్ ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని తమ విచారణలో తేలినట్టు వివరించారు. టీవీలో చూసి ఆమెను ప్రేమించినట్టు తనకు ఇచ్చి వివాహం చేయాలని ఆయన పోలీసుల విచారణలో కూడా చెబుతున్నారు.