మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ లో పడుతూ లేస్తూ ఎలాగోలా 0.5 మిలియన్ మార్క్ ని అందుకోగా మిగిలిన చోట్లా మాత్రం బానీ రాబట్టింది. కర్ణాటక మరియు సీడెడ్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం వీక్ గా ఉన్నా ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మహర్షి దుమ్ము లేపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందా లేదా అనేది తేలనుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే రెండు రాష్ట్రాలలో అవలీలగా 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 30 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు, అయితే ఓవర్సీస్ లో మహేష్ ఇతర సినిమా ల రేంజ్ లో మహర్షి పెర్ఫార్మ్ చేసి ఉంటే 1 మిలియన్ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చేవి, ఫస్ట్ డే మరిన్ని రికార్డులు కొట్టేది, అక్కడ దెబ్బ కొట్టగా ఇండియాలో మహేష్ స్టార్ డం తో తొలిరోజు దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు.