నేనే సీఈవో….లైవ్ లోకి వచ్చిన రవి ప్రకాష్

టీవీ9 సీఈవో పదవి నుంచి తనను తప్పించారన్న ప్రచారాన్ని రవిప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన ఆయన లైవ్ లో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టంచేశారు. NCLT కేసు కోర్టులో ఉందని మే 16 విచారణ జరగుతుందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని అవన్నీ నిలబడబోవని చెప్పారు. ఆకేసును బట్టి పుకార్లను నమ్మవద్దని సూచించారు. కొన్ని ఛానెళ్లు తప్పుడు ప్రసారం చేశాయని తను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలు అవాస్తవమని నన్నెవరూ అరెస్ట్ చేయలేదనీ మొన్న రాత్రి (ఈనెల 7న) టీవీ 9 స్టూడియోలో ఉన్నానని నిన్న వేరే ఊరు వెళ్లడం వల్ల ఈరోజు రావడం ఆలస్యమైందని ప్రస్తుతం తాను టీవీ9 స్టూడియోలో ఉన్నానని ఇప్పుడు కూడా టీవీ9 సీఈవోగా మాట్లాడుతున్నానని తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవి ప్రకాష్ స్పష్టంచేశారు. గందరగోళాన్ని తగ్గించడానికే స్టూడియోకు వచ్చి మాట్లాతున్నట్లు తేల్చిచెప్పారు.