టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఇంగ్లాండ్

england won the toss and choose to bat first

ప్రపంచకప్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. సెమీఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు ఆరంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది.

గత మ్యాచ్‌లో భారత్‌పై నెగ్గిన ఇంగ్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. హార్డ్‌హిట్టర్ జేసర్ రాయ్ జట్టులోకి రావడం.. బెయిర్‌స్టో శతకంతో సత్తాచాడటంతో ఆ జట్టుగా జోరుమీదుంది. మరోవైపు పాకిస్థాన్, ఆస్ట్రేలియా చేతిలో వరుసగా ఓడిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాలని ఆశిస్తోంది