ఫేస్ బుక్ న్యూలోగో

ఫేస్ బుక్ న్యూలోగో

ఫేస్ బుక్, నూతన లోగోను ఆవిష్కరించనున్నది. ఈ సోషల్ మీడియా దిగ్గజం వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ కి కూడా మాతృ సంస్థ. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫేస్ బుక్, నూతన లోగోను విడుదల చేసింది.

ఫేస్ బుక్ యాప్, మెసింజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్యాప్, వర్క్ ప్లేస్, పోర్టల్, కాలిబ్రా లాంటి అనుబంధ యాప్స్ ఫేస్ బుక్ అధీనంలోనే ఉన్నాయి. కొత్త వెబ్ సైట్ ను కూడా ఫేస్ బుక్ త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో వెల్లడించారు.

600ల మిలియన్లకు పైగా వినియోగదారులు ఫేస్‌బుక్‌లో ఉన్నారు. ఫేస్ బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో మాట్లాడుతూ అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుండి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటుందని తెలిపారు.