సోషల్ మీడియాలో విచ్చలవిడి కంటెంట్ కట్టడి కోసం ఐటీ చట్టంలో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఇది ఒక కోణం. అలాగే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు స్వతహాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో దిగ్గజంగా అభివర్ణించే ఫేస్బుక్ తన సొంత రూల్స్‌ను పక్కనపెట్టేస్తోంది. యూజర్లను ‘హైప్రొఫైల్’ కోణంలో విభజించి.. వివక్ష ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో వాళ్లు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నా.. చూస్తూ ఊరుకుంటోంది.
హైప్రొఫైల్ సెలబ్రిటీలు, నటులు, రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాలకు చెందిన కొంతమంది యూజర్లు.. తమ ఇష్టమొచ్చినట్లు ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. వీటిలో న్యూడిటీ, హింస, చైల్డ్ ఎబ్యూజ్, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ఇతరులను ఇబ్బందిపెట్టే విధంగా.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ లెక్కన ఫేస్బుక్ రూల్స్ ప్రకారం నడుచుకోవడం వాళ్లు లేదు.
అయినా ఫేస్బుక్ వాళ్ల అకౌంట్లపై చర్యలు తీసుకోవడం లేదు. సాకర్ ఆటగాడు నైమర్.. తన ఫేస్బుక్లో నగ్నంగా ఉన్న ఓ మహిళ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె అతనిపై అత్యాచార ఆరోపణలు చేసేంది. అందుకే ప్రతీకారంగా ఆ పని చేశాడు. ఈ విషయంలో అకౌంట్ రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోని ఫేస్బుక్.. కంటితుడుపు చర్యగా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇది హై ప్రొఫైల్ సెలబ్రిటీల విషయంలో ఫేస్బుక్ వ్యవహరిస్తున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. క్లిక్: జుకర్‌బర్గ్‌పై ట్రంప్ బూతుపురాణం
క్వాలిటీ కంట్రోల్ మెకానిజంలో ఫేస్బుక్ దారుణంగా విఫలం అవుతోందని, ఫేస్‌బుక్‌ను డర్టీగా మార్చేసిందన్నది తాజా ఆరోపణ. క్రాస్‌చెక్(Xcheck) పేరుతో ప్రతీ ఏటా విడుదలయ్యే రిపోర్ట్ ఆధారంగా సోమవారం వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. 2020లో లక్షల మంది బ్లూటిక్ మార్క్ ఉన్న సెలబ్రిటీల అకౌంట్లను, రాజకీయ నాయకుల అకౌంట్లను పరిశీలించినట్లు ఆ కథనం వెల్లడించింది.
అయితే ఈ కథనాన్ని కొట్టిపడేసిన ఫేస్బుక్ ప్రతినిధి ఆండీ స్టోన్.. ఫేస్బుక్ రూల్స్ అందరికీ ఒకేలా వర్తించడం లేదన్న విషయంతో ఏకీభవించారు. వైట్ లిస్ట్ పేరుతో కొందరు ప్రముఖులకు ఫేస్బుక్ నుంచి మినహాయింపులు ఇస్తుందన్న క్రాస్ చెక్ నివేదిక.. ఆ ప్రముఖుల్లో హిలరీ క్లింటన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటి పేర్లను సైతం ప్రస్తావించడం విశేషం.