శ్రుతీ హాసన్ కోసం ప్రభాస్ 20 రకాల వంటకాలు

శ్రుతీ హాసన్ కోసం ప్రభాస్ 20 రకాల వంటకాలు

శ్రుతీ హాసన్ సోషల్ మీడియాలో చేసే అల్లరికి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి శ్రుతీ హాసన్ చేసే అల్లరి ఎంతలా వైరల్ అవుతుంటుందో తెలిసిందే. ఈ జంట ముంబైలో కలిసి ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఈ ఇద్దరూ చేసిన రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇటు సినిమా షూటింగ్‌లతో అటు ప్రియుడితో కలిసి ఫుల్లుగా బిజీగా ఉంటోంది. ఇక ఎయిర్ పోర్టులో శంతను, శ్రుతీ హాసన్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎయిర్ పోర్ట్ ముందే ముద్దులు, హగ్గులు పెట్టుకుంటూ దుమ్ములేపేవారు.

ఇక శ్రుతీ హాసన్ సలార్ సెట్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఇక శ్రుతీ హాసన్ కోసం ప్రభాస్ ఏర్పాటు చేసిన లంచ్ పార్టీ గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తన ఇంట్లో వండించిన దాదాపు 20 రకాల వంటకాలను శ్రుతీ హాసన్ కోసం తీసుకొచ్చాడు. అలా శ్రుతీ హాసన్ సెట్ మీద చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు మాత్రం చుక్కలు చూపిస్తోన్నట్టుంది.

సెట్ మీద తనకు ఇష్టమైన వ్యక్తి అంటూ ప్రశాంత్ నీల్ గురించి శ్రుతీ హాసన్ ఇది వరకే ఎన్నో సార్లు చెప్పింది. అయితే తాజాగా మరోసారి శ్రుతీ హాసన్ సలార్ సెట్ మీద అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిందో లేదా గానీ మళ్లీ ప్రశాంత్ నీల్‌ను విసుగెత్తించేస్తోంది. తనకు ఇష్టమైన వ్యక్తిని తనకు ఇష్టమొచ్చినట్టుగా చేయడం ఇంకా ఎంతో ఇష్టమని శ్రుతీ హాసన్ చెప్పింది. మొత్తానికి శ్రుతీ హాసన్ సలార్ సెట్‌లో దుమ్ములేపుతోంది.