నాగ్‌, టబుల కలయిక.. నిజం కాదు

fake news about nagarjuna and tabu movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అలనాటి హిట్‌ పెయిర్‌ నాగార్జున, టబులు చాలా కాలం తర్వాత కలిసి నటించబోతున్నట్లుగా గత మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. నాగార్జున, టబుల మద్య ప్రేమ వ్యవహారం కూడా అప్పట్లో సాగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. నాగార్జున మరియు టబుల కలయికలో సినిమా వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆసక్తి పెంచుకుంటారు. ఇద్దరి కాంబోలో వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ ఎలా ఉంటాయా అని సినీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, నాగార్జునతో టబు నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు అంటూ వర్మ కంపెనీ నుండి ప్రకటన వచ్చింది.

Nagarjuna-and-Tabu-may-pair

 

‘శివ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ కాంబోలో చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున మరియు రామ్‌గోపాల్‌ వర్మల కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ సినిమాలో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. నాగార్జునకు జంటగా ముద్దుగుమ్మ టబును హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని వర్మ మాత్రం ఇప్పటి వరకు హీరోయిన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నాగార్జున కొసం కొత్త హీరోయిన్‌, యంగ్‌ హీరోయిన్స్‌ను వర్మ పరిశీలిస్తున్నాడు అంటూ వర్మ కంపెనీ నుండి సమాచారం అందుతుంది. అసలు టబు పేరును కూడా వర్మ పరిగణలోకి తీసుకోలేదని వారు అంటున్నారు.

nagarjuna

వర్మ సినిమాతో పాటు శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి నాగార్జున మరో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో నాగార్జునకు జోడీగా టబు నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అశ్వినీదత్‌ నిర్మించబోతున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. కాని నాగ్‌కు జోడీగా ఎవరు అనే విషయాన్ని మాత్రం నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు. ఒక వేళ ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో నాగార్జునకు జోడీగా టబు నటిస్తే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశాలున్నాయి.