సెకండ్ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ ?

Is 'Family Star' getting ready for second song release?
Is 'Family Star' getting ready for second song release?

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంల తెరక్కేకుతున్న లేటెస్ట్ ఫామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ నందనందనా అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం నెక్స్ట్ వీక్ ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సాంగ్ కూడా మెలోడియస్ గా సాగడంతో పాటు శ్రోతలను మరింతగా ఆకట్టుకోనుందట. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ అలరించేలా దర్శకుడు పరశురామ్ పెట్ల ఫ్యామిలీ స్టార్ సినిమా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ అనంతరం సినిమా మంచి విజయం అందుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.