ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ కి రెడీ!

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ కి రెడీ!
Cinema News

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఖుషి సక్సెస్ తో మంచి జోష్ మీదున్న తమ హీరో విజయ్, తప్పకుండా ఫ్యామిలీ స్టార్ తో మరొక విజయం అందుకోవడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్.

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ కి రెడీ!
Family Star

ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంట . కాగా ఈ సింగిల్ యొక్క అప్ డేట్ దీపావళికి రానుందని టాక్. ఇక ఈ సినిమా ని అన్ని కార్యక్రమాలు ముగించి రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకురానున్నారు మేకర్స్.