శ్రీశైల ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం…!

Fire Accident Down Near Srisailam Temple

శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

srisailam-temple

ఈవో కార్యాలయం భవనం ముందు భాగంలోని ఓ బొమ్మల దుకాణంలో అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో 13 తాత్కాలిక దుకాణాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వలెనే ప్రమాదం సంభవించింది అని తెలుస్తోంది.

srisalam-templr-fire