పెళ్ళిలో గొడవ…ఇద్దరి సజీవ దహనం !

marriage

గత కొన్నేళ్ళగా ప్రేమించుకుంటున్న ఓ జంట తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలోనే వివాహం జరగడంతో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇరుకుటుంబాల మధ్య సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్ వేడుక ప్రారంభమైంది. బంధువుల సందడితో ఉన్న ఆ ఇంటిలో అంతలోనే విషాదం అలుముకుంది ఇరుకుటుంబాల మధ్య నెలకొన్న చిన్న వివాదం రెండు ప్రాణాలను బలితీసునేంత వరకు వెళ్లింది. దీంతో ఆ గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్ కుమార్తె శిరీషలు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల ఆమోదయోగ్యంతో వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తక్కువ మంది సమక్షంలో జరగడంతో నిన్న సాయంత్రం ఇరుకుటుంబాలు ఘనంగా రిసెప్షన్ నిర్వహించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రిసెప్షన్ ప్రారంభమైంది. బంధువుల సందడితే వేదిక సందడిగా మారింది. అయితే రిసెప్షన్ లో వరుడు ప్రసాద్ బంధువులు బత్తిన నూకరాజు, ప్రసాద్, వధువు శిరీష బంధువులు పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్ లను హేళన చెయ్యడంతో వివాదం నెలకొంది. వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది.

 Two Burnt In Fire Accident At kakinada

రెండు వర్గాలుగా విడిపోయిన వారు కత్తిపోట్లతో దాడులకు దిగారు. ఈ దాడిలో వధువు బంధువులు సుధాకర్ రాజేంద్రప్రసాద్ లు గాయాలపాలయ్యారు. దీంతో ఆగ్రహం చెందిన సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ లు తమ అనుచరులతో కలిసి నూకరాజు, ప్రసాద్‌లను వెంటాడారు. వారి భారి నుంచి తప్పించుకునేందుకు నూకరాజు, ప్రసాద్ లు గ్రామం అంతా తిరిగారు. చివరికి లోవరాజు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ కూడా సుధాకర్ అతని అనుచరులు రావడంతో భయంతో పెండ్లి కుమారుడు ఇంట్లోకి వెళ్లి దాకున్నారు. ఇంట్లో దాకున్న నూకరాజు, ప్రసాద్ లను ఎలాగైన అంతమెుందించాలని ప్రయత్నించిన సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ అతని అనుచరులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్‌ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్‌ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్‌లు సజీవ దహనమయ్యారు. సుమారు అరగంట పాటు ఆర్తనాదాలు చేసినా ఎవరూ వారిని రక్షించడానికి సాహసించ లేదు. అయితే వారి మధ్య చాలా కాలంగా తగాదాలు జరుగుతున్నాయి. 2017 అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. పెద్దలు వారి మధ్య సయోద్య కుదర్చడంతో గత జనవరిలో లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నారు. పెళ్లి కుమారుడు ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఇద్దరు సజీవ దహనం అవడంతో కుటుంభ సభ్యులు, బంధువులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘోరానికి తమ ఇల్లే వేదికైందని మదనపడుతున్నారు.