హౌరా బ్రిడ్జి దగ్గరలో భారీ అగ్నిప్రమాదం

fire accident near howrah bridge

పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని చరిత్రాత్మక హౌరా బ్రిడ్జి కి అతి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రిడ్జికి సమీపంలో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోడౌన్‌లోకి వెళ్లేందుకు పొగ ఇబ్బందిగా మారిందని అంటూన్నారు. గోడౌన్‌లోని మధ్య భాగం పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.