విధేయతకి జగన్ పెద్ద పీట…మంత్రి పదవి ఇవ్వలేకున్నా…చెవిరెడ్డికి రెండు పదవులు

two positions for chevireddy

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సీఎం జగన్ రెండు పదవులు కేటాయించారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి భాస్కర్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు. మంత్రి ప‌ద‌వీ ఆశించిన‌ప్ప‌టికీ స‌మీక‌రణ‌ల దృష్ట్యా అది సాధ్య‌కాక‌పోవ‌డంతో తుడా ఛైర్మ‌న్ గా ఆయ‌న‌ను నియ‌మించారు. ఇటీవలే ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. దీంతో.. ఆయనకు ఏపీ ప్రభుత్వం రెండు పదవులు కేటాయించినట్లుఅయ్యింది. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట ప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది. 13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను పార్టీ కైవసం చేసుకుంది.