హీరోయిన్ కి తప్పిన పెనుప్రమాదం…క్షణాల్లో ?

The heroine has escaped from a tragic accident

ప్రముఖ మలయాళ హీరోయిన్‌ అర్చన కవి పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరోయిన్ అర్చన కవి బుధవారం నాడు కొచ్చి ఎయిర్ పోర్ట్‌కి కారులో ప్రయాణిస్తున్న సమయంలో సిటీ మెట్రో శ్లాబ్ ఆమె కారుపై పడింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న పూర్తిగా ద్వంసం కావడంతో పాటు.. కారు అద్దాలను బద్దలుకొట్టుకుని కాంక్రీటు పెళ్లలు కారు లోపలికి చొచ్చుకొని వచ్చాయి. ఆ సమయంలో కారులో ఉన్న హీరోయిన్‌ అర్చనకు పెను ప్రమాదమే తప్పింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ కారు డ్రైవర్‌కి నష్టపరిహారం చెల్లించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరింది హీరోయిన్. ఈ ఘటనపై విచారణ జరపడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని అర్చన ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, పలు మాలయాళ చిత్రాల్లో నటించిన అర్చన.. తెలుగులో మధుర శ్రీదర్‌ దర్శకత్వం వహించిన బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రంలో నటించారు.