దేవరకొండా….తమ్ముడికే హ్యాండ్ ఇస్తున్నావా ?

devarakonda giving hand to brother

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ తక్కువ సమయంలో స్టార్ హోదా అందుకున్నాడు. ఇప్పుడు విజయ్ బాటలో అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘దొరసాని’ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ టీజర్ లో ఆనంద్ దేవరకొండ లుక్స్, అతడి నటనపై కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో దేవరకొండ నిలదొక్కుకుంటాడనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ అయినా గట్టిగా చేస్తే ఆడియన్స్ సినిమాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ సపోర్ట్ తమ్ముడికి అవసరమనిపిస్తోంది. కానీ విజయ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మరోపక్క తన స్నేహితుడు నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ట్రైలర్ ని మాత్రం షేర్ చేసి తన ప్రేమ కురిపించాడు. దీని గురించి ప్రత్యేకంగా నాలుగైదు లైన్లలో ప్రస్తావిస్తూ విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకున్నాడు. మిలియన్ పైగా ఫాలోయర్స్ ఉన్న విజయ్ పోస్ట్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. స్వంత తమ్ముడు మొదటి సినిమా కూడా ప్రమోట్ చేయకుండా బయట సినిమాకు ప్రమోట్ చేసి ఇలా సోదరుడికి హ్యాండ్ ఇవ్వడం ఏమిటని రకరకాలగా ఆడుకుంటున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే దొరసాని నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని స్వయానా విజయ్ మేనమామ. నిజానికి పెళ్లి చూపులు సినిమా కూడా ఈయనే నిర్మించారు మరి దొరసాని గురించి విజయ్ ఎందుకు మౌనాన్ని ఆశ్రయించాడో అన్నదమ్ములకే తెలియాలి.