వేశ్యగా మారుతున్న పాయల్…తప్పేమీ కాదట

payal rajput changing into prostitute

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు యూత్ హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్‌ పుత్. ఈ సినిమాలో బోల్డ్‌గా, నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించిన ఈ పంజాబీ భామ ఆఫర్లలో మునిగి తేలుతోంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా గడిపేస్తోంది. అక్కినేని నాగార్జున నటిస్తున్న మన్మథుడు-2, వెంకటేశ్ నటిస్తున్న వెంకీమామ, రవితేజ డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతోంది. 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరుపొందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో పాయల్ వేశ్యగా నటించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రెండో కథనాయికగా పాయల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర వేశ్య అని, పాత్ర కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఆమె అంగీరించారు. అంతేకాక  వేశ్య పాత్రలో నటించడం తప్పెందుకు అవుతుందని, ఆ పాత్ర ఒప్పుకున్నాక వారి జీవితాలు, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టానని కూడా ఆమె చెప్పుకొచ్చింది. వేశ్యలు బతకడానికి మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారని, దాన్ని ఆపాలని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదని ఆమె చెప్పుకొచ్చింది.