తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న షారుఖ్ ఖాన్…!

Fire On Set Of Shah Rukh Khan Starrer Zero Movie In Mumbai

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. తాను హీరోగా నటిస్తున్న ‘జీరో’ చిత్రం షూటింగ్ ముంబై లోని ఫిలింసిటీ లో జరుగుతుండగా, పాత చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన సమయంలో షారుఖ్ లొకేషన్లోనే ఉండగా, దట్టమైన పొగ అల్లుకోవడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం. అగ్నిప్రమాదం గురించిన సమాచారం తెలియడంతో హుటాహుటిన అగ్నిమాపక బృందం సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను నిలుపుదల చేయడంతో, ఆస్తి నష్టం అంతగా జరగలేదు. సెట్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.

Shah-Rukh-Khan-Starrer-Zero

జీరో సినిమా విషయానికి వస్తే డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక మరుగుజ్జుగా నటిస్తుండగా, ఆయన సరసన అనుష్క శర్మ మరియు కత్రినా కైఫ్ లు నటిస్తున్నారు. అనుష్క శర్మ ఈ సినిమాలో వీల్ చైర్ కు అతుక్కుపోయే దివ్యాంగురాలి పాత్రలో కనిపించబోతుండగా, కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా త్రికోణ ప్రేమకథ గా చెప్తున్నప్పటికి, ప్రేమలో ఉన్న అసలు అంతరార్ధం ఏమిటో మా సినిమా చూపెడుతుందని ఈ సినిమా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెలిపారు. అజయ్-అతుల్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంటూ, సంగీత అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. షారుఖ్ ఖాన్ గత సినిమాలు విజయం సాధించకపోయినా, ఈ సినిమాకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తాను దర్శకత్వం వహించిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను-2, రాంజానా సినిమాలతో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించాడు.

Shah-Rukh-Khan-fire-acceden