అరోరా నగరంలో కాల్పు‍లు

అరోరా నగరంలో కాల్పు‍లు

యూఎస్‌ కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ సమీపంలో జరిగిన కాల్పు‍ల్లో ఐదుగురు యువకులు గాయపడినట్లు అరోరా పోలీసులు తెలిపారు. అయితే అనుమానితుడు ఎవరు ఆ సమయంలో ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు సంఘటన పాఠశాల లోపల జరగలేదని పార్క్ వద్ద జరిగిందన్నారు.అంతేకాదు పార్క్‌కి సంబంధించిన సీసీపుటేజ్‌ కెమరాలను కూడా పరిశీలిస్తున్నట్టుల తెలిపారు.

పైగా హైస్కూల్‌కి సంబంధించిన కార్‌ పార్కింగ్‌లో అత్యవసర వాహనాలు కూడా ఉన్నాయని, ఈ ఘటన జరిగినే వెంటనే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినట్లు పోలీసలు చెప్పారు. అయితే కొలరాడో తుపాకీ హింసకు కొత్తేమీ కాదు. పైగా యూఎస్‌ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన రెండు సాముహిక కాల్పలు ఈ ప్రాంతంలోనే జరిగిన సంగతి తెలిసిందే.