రవిప్రకాష్ పై టీవీ9 లో ఫోర్జరీ 

రవిప్రకాష్ పై టీవీ9 లో ఫోర్జరీ 

నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుక్కెదురైంది. ఇప్పటికే రెండు సార్లు హైకోర్టు తలుపుతట్టిన రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. సుప్రీం కోర్టును ఆశ్రయించినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో భంగపడ్డారు.

తాజాగా ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలు తొలగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్. పోలీస్ స్టేషన్ కు హాజరు కాకుండా విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సబ్ పిటీషన్ దాఖలు చేశాడు.

అయితే ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు రవిప్రకాష్ వాదనను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ నిబంధనలు సడలించేందుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా పిటీషన్ ను తిరస్కరించింది.

నిధుల మళ్లింపు చేశాడని దాని యాజమాన్య సంస్థ అలంద మీడియా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్దిరోజులు అజ్ఞాతంలో ఉంటూ నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు సూచనల మేరకు కోర్టులో లొంగిపోయి ఇప్పుడు విచారణకు హాజరవుతున్నాడు. అయితే ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలు తొలగించాలని.. విదేశాలకు వెళ్లడానికి అనుమతివ్వాలని పెట్టుకున్న పిటీషన్ తాజాగా హైకోర్టు తిరస్కరించింది