దారుణం: ఫ్రెండ్ భార్యను గదిలో బంధించి అత్యాచారం… భర్త వచ్చి విడవమన్నా …….

13 Years Old Girl Raped By A Neighbor In Kadalur District Of Tamil Nadu State

ఆంధ్రప్రదేశ్ లో కనీవనీ ఎరుగని ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏలూరులోని రామకృష్ణాపురంలో ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో డ్రైవర్‌ హేమ సుందర్ అలియాస్ సురేష్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. హేమ సుందర్ కు అతని భార్యకు తరచూ మనస్పర్థలు రావడం గమనించిన నాని ఏలాగైనా ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. అదేతడవుగా.. తన స్నేహితుడి భార్యను అనుభవించాలనుకున్నాడు. దీంతో హేమసుందర్ భార్యపై కన్నేసిన నాని అవకాశం కోసం ఎదురు చూశాడు. గొడవలు ఎక్కువ కావడంతో ఈ నెల 9వ తేదీన సురేష్ భార్య ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. సురేష్ ఏమో కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నాని ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మించాడు.

ఇక దొరికిందే సందు అనుకొని నాని.. మరో డ్రైవర్‌ కాశీ సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని తన రూమ్ కి తీసుకొచ్చి బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసుకున్న ఆమె భర్త వచ్చి భార్యను విడిపించటానికి సురేష్ నాని రూమ్ కి వెళ్లాడు. నాని ఆ సమయంలో అతడినికి కూడా కొట్టి గాయపరిచాడు. దీంతో సురేష్ జరిగిన విషయాన్ని నాని బందువులకు తెలియజేశాడు. దీంతో వారంతా నానిని నిలదీశారు. దాంతో నాని ఆమెను పంపించివేశారు. కాగా బాధితురాలు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్‌ చేసి కారును సీజ్‌ చేశారు. అలాగే వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.