హైదరాబాద్ నడిబొడ్డున యువతీ ఆత్మహత్య

girl Commits Suicide By Jumping Off From Mayuri Building at abids

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హైదరాబాద్ అబిడ్స్ లో ఈరోజు విషాదం చోటు చేసికుంది . మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ (18) ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లిన ఆమె అక్కడ్నుంచి కిందకు దూకింది. బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేస్తూ కొందరు పోలీసులకు ఫోన్ చేశారు.. మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.. మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే బిల్డింగ్ చివరి అంచు వరకు వచ్చిన కౌర్.. నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెంటనే దూకేసింది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడటంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. కళ్ల ఎదుట.. ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటాన్ని కొందరు వీడియోలో చిత్రీకించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అయ్యింది. తొమ్మిది అంతస్తుల నుంచి కిందకి చూస్తేనే కళ్లు తిరుగుతాయి.. అలాంటిది ఓ యువతి దూకటం చూసి అక్కడ ఉన్న వారు కొద్దిసేపు షాక్ లో ఉండి పోయారు.