మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక సుదినం అనే చెప్పాలి. తాము దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ఎంతగానో ఎదురు చూసిన డ్రీం కాంబో మహేష్ మరియు రాజమౌళి సినిమా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చేసింది. తమ ఇద్దరి నుంచి ఒక సినిమా ఉందని రాజమౌళి అందించిన ఒక చల్లని వార్తతో మహేష్ అభిమానులు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క ఈ చిత్రం ఎలా ఉండాలి అన్నది అప్పుడే మహేష్ అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు.

రాజమౌళి మనసులో ఏముందో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి జాన్రా సినిమా కోరుకుంటున్నారో తెలుపుతున్నారు. ఈ ఇద్దరి నుంచి ఎలాంటి చారిత్రాత్మిక సినిమా కానీ లేదా స్కైఫై సినిమా కాయాన్ని కోరుకోవట్లేదట. రాజమౌళి మహేష్ తో ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ బొమ్మ పడితే చాలని అంటున్నారు. ఇది ప్రస్తుతానికి వీరి ఒపీనియన్ మరి రాజమౌళి మహేష్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేసారో ఎవరికి తెలుసు?