మహేష్ బాబు ని ఎంచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి

మహేష్ బాబు ని ఎంచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి

మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఏకైక దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళితో ఒక్క సినిమా అయినా సరే చెయ్యాలి అని మన టాలీవుడ్ లో కోరుకోని హీరో ఉండరు. కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టుగా రాజమౌళి తన సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

అలా తాను తీసిన సినిమాలు మంచి కేజ్రీగా ఉండడంతో మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మొత్తం మన దేశంలోనే అపజయమే ఎరుగని దర్శకునిలా మారిపోయాడు. మరి అలంటి దర్శకునికి ఓ స్టార్ హీరో తోడైతే అదే స్తర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే?ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది.

బాక్సాఫీస్ కు ఇప్పటి యుద్దానికి టైం కూడా మొదలయ్యింది. మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డ్రీమ్ కాంబో ఇది. ఆ కాంబో ఇప్పుడు సెట్టయ్యింది అని నేరుగా దర్శకుడు రాజమౌళియే చెప్పడంతో మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పుడు భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తెరకెక్కించిన అనంతరం ఈ సినిమా తాము చేయబోతున్నామని స్వయంగా రాజమౌళియే ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు.అయితే ఈ చిత్రం ఇప్పుడే ఖచ్చితంగా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సినిమా ముందు వరకు మన దక్షిణాది వరకే రాజమౌళి సినిమాలో హీరోల పేర్లు వినిపించేవి.

కానీ ఇప్పుడు ఆ సినిమా తర్వాత యావత్తు ప్రపంచం అంతా రీ సౌండ్ వినిపిస్తుంది. సో మహేష్ మరోయు రాజమౌళిల కాంబో ఇప్పుడు సెట్ అవ్వడమే కరెక్ట్ అని చెప్పాలి. మరి మహేష్ లాంటి హ్యాండ్సమ్ హాలీవుడ్ కటౌట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి కథను సిద్ధం చేసుకున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.