ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటిటి లోకి సలార్:ఎప్పుడంటే ?

ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటిటి లోకి సలార్. ఎప్పుడంటే ?
Cinema News

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ లేటెస్ట్గా నటించిన మూవీ సలార్ పార్ట్1 సీజ్ ఫైర్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ గతేడాది డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే గాకుండా బాక్సాఫీస్ వద్ద కలెెక్షన్ల ఊచకోత కోసింది. ఇప్పటి వరకు సలార్ రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ విడుదల కోసం ఎంతో కాలం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఓటీటీ రిలీజ్ కోసం మాత్రం ఎక్కువగా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విడుదలైన నెలరోజులకే అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.

 ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..  ఓటిటి లోకి సలార్. ఎప్పుడంటే ?
Salaar Movie

జనవరి 20 (శనివారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సలార్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ముందుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. హిందీలో స్ట్రీమింగ్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని టాక్. థియేటర్లలో రికార్డులు సృష్టించిన సలార్, ఓటీటీలోనూ అదే రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు .