గుంటూరు కారం విఫలానికి నాగ వంశీ కారణం ఏమిటి?

గుంటూరు కారం విఫలానికి నాగ వంశీ కారణం ఏమిటి?
Cinema News

సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ వచ్చింది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు ప్రేక్షకులంతా. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసారు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ డివైడెడ్ టాక్ ను సొంతం చేసుకుంది క్రిటిక్స్ నుండి కూడా గుంటూరు కారం మూవీ కి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి.

గుంటూరు కారం విఫలానికి నాగ వంశీ కారణం ఏమిటి?
Guntur Karam Movie

క్రిటిక్స్ ఓపెనింగ్స్ అండ్ రివ్యూస్ ను పక్కన పెడితే గుంటూరు కారం టాక్ కి భిన్నంగా కలెక్షన్లను రాబడుతుందని అన్నారు నాగ వంశీ మొదటి వారంలోనే 212 కోట్లని రాబట్టి 90% రికవర్ చేసింది అని చెప్పారు నాగ వంశీ. గుంటూరు కారం మూవీ సెకండ్ వీక్ లో ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి నెగటివ్ టాక్ రావడానికి కారణాలు చెప్పారు. మూవీ అర్ధరాత్రి ఒంటి గంటకి కొన్ని షోస్ పడ్డాయి అన్నారు ఆ షో వేయడం వలన ఇదంతా జరిగిందని నాగ వంశీ అన్నారు ఫ్యామిలీ మూవీ కాబట్టి అర్ధరాత్రి షో వేయకుండా ఉండాల్సింది అని అన్నారు