గుడ్ న్యూస్ : పుష్ప-2 మూవీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది .ఎప్పుడో తెలుసా ?

Good news: Latest update from Pushpa 2 movie... do you know what..?
Good news: Latest update from Pushpa 2 movie... do you know what..?

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల లో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప మూవీ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్నది . ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఒక రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ ఇంకా రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Good news: Latest update from Pushpa 2 movie... do you know what..?
Good news: Latest update from Pushpa 2 movie… do you know what..?

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ . ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్పరాజ్ కాలి పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 షూటింగ్ చివరిదశకి చేరుకుంది. ఈ మూవీ ని ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినా.. నెట్టింట మాత్రం ఈ మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందని రూమర్స్ నడుస్తున్నాయి. దీంతో ప్రతి అప్డేట్ లోనూ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15 అంటూ నొక్కి చెబుతుంది మూవీ మేకర్స్ .