డేరా అనుచ‌రుల నుంచి విశ్వాస్ గుప్తాకు బెదిరింపులు

Gurmeet Singh Supporters warning to Vishwas Gupta

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇద్ద‌రు సాధ్విల‌పై అత్యాచారం కేసులో డేరా బాబా దోషిగా నిర్ధార‌ణ‌యిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌తో పాటు… ఆయ‌న ద‌త్త‌పుత్రిక‌గా చెప్పుకునే హ‌నీప్రీత్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. బాబా అరెస్టు ద‌గ్గ‌ర నుంచి ప‌రారీలో ఉన్న హ‌నీప్రీత్ గురించి ఆమె మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా సంచ‌ల‌నక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. గుర్మీత్ హ‌నీప్రీత్ ను ద‌త్త‌పుత్రిక‌గా చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ… నిజానికీ వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉంద‌ని విశ్వాస్ గుప్తా తెలిపాడు. అంతేకాదు… బాబా… చీక‌టి జీవితానికి సంబంధించి, డేరా వెన‌క దాగున్న ర‌హ‌స్యాల గురించి ఆయ‌న అనేక విష‌యాలు బాహ్య ప్ర‌పంచానికి వెల్ల‌డిచేశాడు. దీంతో విశ్వాస్ గుప్తాకు ఇప్పుడు డేరా బాబా అనుచ‌రుల నుంచి బెదిరింపులు వ‌స్తున్నాయి.

దీనిపై ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదుచేశాడు. గుర్మీత్, హ‌నీప్రీత్ ల బంధంపై అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టినుంచి త‌న‌ను చంపుతామంటూ డేరా గూండాలు బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించాడు. డేరా స‌చ్చా సౌదా అనుబంధ సంస్థ కుర్బానీ నుంచి త‌న‌కు బెదిరింపు లేఖ వ‌చ్చింద‌ని ఫిర్యాదులో పొందుప‌రిచాడు. గుర్మీత్ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తే… తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించార‌ని తెలిపాడు. డేరా బాబాకు భ‌క్తుడైన విశ్వాస్ గుప్తా 1991లో హ‌నీప్రీత్ ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్లకు భార్య‌తో క‌లిసి డేరా బాబా ఆశ్ర‌మానికి వెళ్ల‌డం విశ్వాస్ గుప్తా జీవితాన్ని అనూహ్య మ‌లుపులు తిప్పింది. హ‌నీప్రీత్ పై క‌న్నేసిన బాబా… విశ్వాస్ గుప్తాను అనేక ర‌కాలుగా వేధించాడు. చివ‌రికి హ‌నీప్రీత్ భ‌ర్త‌కు దూర‌మై డేరాబాబాకు ద‌గ్గ‌ర‌యింది.

ఆశ్ర‌మంలో ఉన్న రోజుల్లోనూ, బ‌యట‌కు వెళ్లిన‌ప్పుడూ హ‌నీప్రీత్ తో క‌లిసి డేరా బాబా త‌న‌ను నిద్ర కూడా పోనిచ్చేవాడు కాద‌ని, అస‌లు తామిద్ద‌రినీ ఒక గ‌దిలోనే ఉండ‌నిచ్చే వాడు కాద‌ని విశ్వాస్ గుప్తా వెల్ల‌డించాడు. డేరా బాబా అస‌లు స్వ‌రూపాన్ని గ్ర‌హించిన విశ్వాస్ గుప్తా… ఆశ్ర‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. త‌న భార్య హ‌నీప్రీత్ ను డేరాబాబా కిడ్నాప్ చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదుచేశాడు. అయితే అప్ప‌టికే డేరా బాబాకు ద‌గ్గ‌రైన హ‌నీప్రీత్ భ‌ర్త‌కే వ్య‌తిరేకంగా సాక్ష్య‌మిచ్చింది. త‌ర్వాతి రోజుల్లో హ‌నీప్రీత్ గుర్మీత్ తో క‌లిసి… సంప‌న్న‌డైన భ‌ర్త‌ను అనేక ర‌కాలుగా వేధింపుల‌కు గురిచేసింది. దీంతో విశ్వాస్ గుప్తా ఆమెకు విడాకులిచ్చి మ‌రో వివాహం చేసుకున్నాడు. అయితే విడాకులు తీసుకునే ముందే హ‌నీప్రీత్ ప‌న్నిన ఓ కుట్ర గురించి ఇటీవ‌లే ఓ విష‌యం వెలుగుచూసింది. డేరా బాబాతో ఓ బిడ్డ‌ను క‌ని… ఆ బిడ్డ‌ను విశ్వాస్ గుప్తా సంతానం గా చూపించి… ఆ బిడ్డ‌ను డేరా వార‌సులుగా చేయాల‌ని హ‌నీప్రీత్ వ్యూహం ర‌చించింది. ఈ లోపే విశ్వాస్ ఆమెకు విడాకులివ్వ‌డంతో ఆ ప‌న్నాగం పార‌లేదు.