“ఉస్తాద్ భగత్ సింగ్‌” పై హరీష్ శంకర్ స్టేట్మెంట్!

“ఉస్తాద్ భగత్ సింగ్‌
Ustad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా పవన్ సెన్సేషనల్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. మరి సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.

“ఉస్తాద్ భగత్ సింగ్‌" పై హరీష్ బాంబు స్టేట్మెంట్!
Ustad Bhagat Singh

అయితే ఈ గ్యాప్ పై బాలయ్య షో లో హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చిన మాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ గ్యాప్ ఒట్టి వెకేషన్ మాత్రమే అని సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ అని హరీష్ తెలిపాడు. దీనితో ఆ సినిమా పట్ల అసలు తను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.