“హెచ్‌సీయూ”మరో ఘనత

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యూఎస్‌ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌2020లో టాప్‌ టెన్‌ లిస్ట్ లో చేరింది. గతంలో కూడా టాప్ టెన్ లో ఉండి రెండోసారికూడా జాబితాలో స్థానం సంపాదించింది.

క్యూఎస్‌ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌2020 లిస్ట్ మంగళవారం విడుదల అయింది. మన దేశంలోని వంద విద్యా సంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్‌ ఇవ్వగా ఐఐటీ బాంబే మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఐఐఎస్‌సీ బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ ఢిల్లీ ఉండగా ఎనమిదవ స్థానంలో హెచ్‌సీయూ నిలిచింది. స్టాఫ్‌ విత్‌ పీహెచ్‌డీ కేటగిరీలో బెస్ట్‌ స్కోర్‌ ఇండికేటర్‌ను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సాదించింది.