‘షీ టీమ్స్’కు ఐదు వసంతాలు

'షీ టీమ్స్'కు ఐదు వసంతాలు

తెలంగాణప్రభుత్వం మహిళల రక్షణ మరియు భద్రతకొసం ఏర్పాటుచేసిన షిటీమ్స్కి ఐదు సంవత్సరాలు పూర్తి కానున్నాయి. అక్టోబరు 24న 2014 తెలంగాణ CM KCR ప్రారంభించారు. కేవలం నగరంలో 100 షి బృందాలను, ఒక్కో బృందంలో మహిళా పోలీసులను ఐదుగురుని నియమించి మహిళలను వేధింపులకు గురి చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీస్కొడానికి ఏర్పాటు చేశారు.మహిళలపై జరిగే దాడులు 20 శాతం హైదరాబాద్ లో తగ్గాయి. భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణ రక్షణకు పని చేస్తూ ప్రతి జిల్లాకు షి టీమ్స్ ని విస్తరించగ మొత్తంగ రాష్ట్రం లో 200 షి టీమ్స్ పనిచేస్తున్నాయి.

ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కెటిఆర్‌ షీటీమ్స్ఐ దేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

మహిళల హక్కులకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, 33,700కేసులను ఐదేళ్ల కాలంలో ‘షీ టీమ్స్’ పరిష్కరించి మహిళల హక్కుల అధిక ప్రాధాన్యత కలిపిస్తుందని అన్నారు.

.