టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్…కేసీఆర్ ప్లాన్ అదే…!

KTR Working Precedent In Telangana

పార్టీలో ఏమిజరుగుతున్నదో కేసీఆర్‌కు చేరవేయడం నాయకులకు, ఎమ్మెల్యేలకు సాధ్యం కావడం లేదు అన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. గత కొంతకాలంగా ఈ ‘గ్యాప్‌’ను మంత్రి కేటీఆర్ భర్తీ చేస్తున్నారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నాయకులు కేటీఆర్‌ కు ‘రిపోర్ట్ ‘చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాలవారీగా కొందరిని నియమించుకుని పేరిట క్యాడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకి కేటీఆర్ ని ’వర్కింగ్ ప్రెసిడెంట్’ నియమించారు కేసీఆర్. అయితే ఏడాది క్రితం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి, చక్రం తిప్పాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఏడాది క్రితం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన కేసీఆర్‌… అప్పట్లో కొన్ని పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మేలో పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చే దిశగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ అన్నీ తానై వ్యవహరించారు.

ktr-kcr

అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలు, సమావేశాలు, వ్యూహప్రతివ్యూహాలు.. ఇలా అన్నింటినీ స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు ఆరు నెలలుగా అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్‌… ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తలమునకలు కావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా పావులు కదిపే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాలే కాదు… ఏపీలో కూడా పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలదూర్చిన విషయాన్ని గులాబీ దళపతి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడంతోనే కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చిందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ హోరాహోరీ తలపడడానికి చంద్రబాబు కారణమన్నది ఆ నేతల వాదన. దీంతో ఏపీ ఎన్నికల్లో చక్రం తిప్పే అంశంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది.

ktr-comments-on-revanth-red

అలాగే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉండగా అందులో 16 సీట్లను గెలుచుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక ఐకాన్‌గా కేసీఆర్ నిలిచారు. ఇక తన విజయం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని చెప్పిన గులాబీ బాస్ ఆ మార్పునకు తనే ముందడుగు వేయబోతున్నట్లు చెప్పారు. అంతకంటే ముందు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి దేశరాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ని వర్కింగ్ ప్రేసిన్దేంట్ గా నియమించడం సంచలనంగా మారింది. రేపు ఆయన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తే కేటీఅర్ ని ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు.