కూటమి వోటమి వెనుక అజ్ఞాతవాసి…!

Man Behind Kapu Vote Bank In Telangana

తెలంగాణ శాసనసభ ఎన్నికలు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ఉత్కంఠ రేపాయి. హోరాహోరీగా జరిగిన పోరులో టీఆర్ఎస్ ధాటికి కూటమి నిలవలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఐదు నెలలు ముందుగానే ఎన్నికలు జరిగాయి. అందులోనూ ఏపీలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ తన చిరకాల శత్రువు కాంగ్రెస్‌తో జట్టుకట్టి పోటీ చేయడం కలిసి రాలేదని విశ్లేషకులు తేల్చారు. అయితే దానికి మరిన్ని కారణాలు విశ్లేషిస్తే పోలింగ్ కి కొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి కీలక వర్గం నుంచి మద్దతు తక్కింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాపు ఓటర్లు టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని కాపునాడు సంఘం ఎన్నికల ముందు రోజు పిలుపునిచ్చింది. నెల క్రితమే దీన్ని తీర్మానించినట్టు ప్రకటనలో పేర్కొన్నా ఎన్నికల ముందు రోజు ఆ ప్రకటన రావడం వ్యూహత్మకమే. తమను బీసీలో చేరుస్తామని కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు మోసం చేశాయని మేనిఫెస్టో లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలని కోరిన తమ జాతి ఉద్యమకారుడి పై జరిగిన నిర్భందకాండను మరిచిపోవద్దని చెప్పింది. కాపునాడు టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. టీఆర్ ఎస్ గెలుపు లో భాగం కావాలని వెళ్లడించింది.

ktr-specch
ఇదే సమయంలో భరత్‌నగర్‌ మెజెస్టిక్ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ ఆత్మీయసదస్సులో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. గడ్డెం పెంచుకున్నోళ్లు అందరూ మనకు విరోధులు కాదు కొందరు మిత్రులు కూడా ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసినవే. నేరుగా జనసేన పార్టీ పేరు ప్రస్తావించకుండా పవన్ ఫ్యాన్స్ తోపాటు కాపు సామాజకవర్గం ఓట్లను తనవైపు తిప్పుకోవటానికి ప్రయత్నించారు. ఇదే వేదికపై జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు కేటీఆర్ ను ఘనంగా సత్కరించారు. జై తెలంగాణ.. జై కేటీఆర్.. జై టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేయటం విశేషం. 2014 ఎన్నికలకు భిన్నంగా ఈసారి సీమాంధ్రులు స్పందించారు. గత ఎన్నికల్లో విభజన అంశాలు హైలెట్ అయ్యాయి. విడిపోయిన బాధలో ఉన్న సీమాంధ్రులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి.. పార్టీలకు అతీతంగా ఓట్లు వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల అభిమానులు అందరూ కూడా తెలంగాణలో ఆయా పార్టీల వైఖరిని అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న జగన్.. కాంగ్రెస్ – టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పని చేయాలని సంకేతాలు పంపారు. దీంతో సీమాంధ్రుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు.. ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఇక్కడ జనసేన తరపున పనిచేసిన ఒక వ్యక్తి గురించి ప్రస్తావించడం ఆవశ్యం, ఎందుకంటే ఆయన కేవలం పార్టీ అధినేత మాట విని శ్రేణులకి చేరవేసి ఊరుకోకుండా కేటీఆర్ తో పాటే అన్ని ప్రాంతాలకు తిరిగి తమ కులం వోట్లు టీఆర్ఎస్ కే పడేలా కృషి చేశాడు. ఆయన ఎవరో కాదు జనసేన నేత కాపు జేఏసీకి చెందిన దాసరి రాము. ఒకరకంగా టీడీపీ కాంగ్రెస్ కూటమిని మట్టి కరిపించడానికి తన వంతు సాయం తను చేశాడనే చెప్పాలి.

ktr-speech