2.0 అరుదైన రికార్డు

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 2.0 ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, భాషలో విడుదలై మంచి రికార్డ్స్ ను నెలకొల్పుతుంది. ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ ను బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు భాగా ఆదరిస్తున్నారు. 2.0 సినిమా కు రజినీకాంత్ హీరో అయిన అక్కడ జనాలు మాత్రం అసలు హీరో అక్షయ్ కుమార్ అంటున్నారు. పక్షి రాజు పాత్రకు భాగా కనెక్ట్ అయ్యారు. 2.0 చిత్రం హింది వెర్షన్ లో 100 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళంలో కాస్త ఆలస్యంగా 100 కోట్లు గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.

Robo 2.0 MOvie Leaked On Tamilrockersవిడుదలైన ప్రతి భాషలో 100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం గా నిలిచింది. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి చిత్రం తరువాత 2.0 చిత్రం నిలిచింది. రజినీకాంత్ ఫాన్స్ 100 కోట్ల గ్రాస్ ను భాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సినిమాలు ప్లాప్ తరువాత రజినీకాంత్ 2.0 చిత్రం హిట్ట్ పడటంతో మరల తన మునపటి ట్రాక్ లోకి వచ్చాడు అంటున్నారు సినిమా విశ్లేషకులు. ప్రస్తుతం రజినీకాంత్ పెట్టా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పొంగల్ కి తెలుగు, తమిళ, హింది భాషలో విడుదల చేస్తున్నారు. మరో హిట్ట్ కొట్టడం ఖాయం అంటున్నారు రజినీకాంత్ అభిమానులు.