“గుడుంబా శంకర్” రీ రిలీజ్ పై అధికారిక ప్రకటన..!

Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గుడుంబా శంకర్ మూవీ ను రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వీర శంకర్ దర్శకత్వం లో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కొణిదెల నాగేంద్ర బాబు నిర్మించిన ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ చేయడానికి పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ సినిమాని ఆగస్ట్ 31 మరియు సెప్టెంబర్ 1 వ తేదీన గుడుంబా శంకర్ ను రిలీజ్ చేస్తున్నాం. అని చెప్పుకొచ్చారు. జల్సా ఆరంజ్ టికెట్స్ ద్వారా వచ్చిన కలెక్షన్లు జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చినట్లుగా

ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా జనసేన పార్టీ ఫండ్ కి అంకితం చేయబడుతుందని అన్నారు . అంతేకాక అధికారిక పోస్టర్ వివరాలు కూడా తెలుపుతాము అని పేర్కొన్నారు నిర్మాత నాగబాబు. ఈ చిత్రం చిత్రంలో మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు