ఎంతో మేలు చేసే కాకరకాయ

ఎంతో మేలు చేసే కాకరకాయ

కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటి వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ వంటి సమస్యల నుండి బయట పడడానికి కాకరకాయ నిజంగా ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం న్యూట్రిషనిస్ట్ ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. మరి వాటి కోసం కూడా ఓ లుక్ వేసేయండి.

ఎప్పుడైనా మనం చేదుగా ఉండే వాటిని ఏమైనా ట్రై చేస్తే కేవలం నాలుకకి మాత్రమే కాకుండా న్యూరో సెంటర్ మెకానిజంపై కూడా ప్రభావం చూపిస్తుంది. గట్‌లో కూడా టేస్ట్ రెసిప్టార్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఇలాంటి చేదు వాటిని తింటే హార్మోన్స్‌లో రెస్పాన్స్ వస్తుంది. ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు ఇంఫ్లేమేషన్ లెవెల్స్ మారుతూ ఉంటాయని న్యూట్రీషనిస్ట్‌లు అంటున్నారు.అయితే ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వంటి వాటి కోసం టాబ్లెట్స్ వేసుకోకుండా కాకరకాయ లాంటివి తీసుకుంటే మంచిదని ఆమె చెబుతున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా హెమోగ్లోబిన్ లెవెల్స్ 7 నుండి 7.5 ఉంటే మందులు ఉపయోగించడం కంటే కూడా ఆహారంతో ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు.

అందుకోసం కాకర కాయ జ్యూస్‌కి సంబంధించిన వివరాలను కూడా చెప్పారు. కాకర కాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి సులువుగా పద్దతిని చెప్పారు. మరి ఆలస్యం ఎందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కూడా చూసేద్దాం.దీని కోసం మొదట తొక్క తో ఉన్న కాకరకాయల్ని, ముక్కలు చేసిన ఉసిరిని, అల్లం, నీళ్లు, నిమ్మ, సాల్ట్ అన్ని వేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టేయండి.బ్లెండ్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చెయ్యాలి. ఈ రసాన్ని ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. దీని వల్ల ఎలాంటి హాని కూడా కలగదు.

ఒకవేళ కనుక మీకు డయాబెటిస్ ఉంటే ఈ జ్యూస్ ని తప్పకుండా తీసుకోండి. దీనితో చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు.ఎన్నో సమస్యలు కాకర కాయతో తగ్గిపోతాయి. అయితే కాకరకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయనేది చూస్తే…కాకరకాయ వల్ల గుండె సంబంధిత సమస్యలు రిస్క్ పూర్తిగా తగ్గుతుంది. కాకరకాయ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలవుతుంది.కాకరకాయ వల్ల కాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. కాకర తీసుకోవడం వల్ల కాన్సర్ కణాలు పెరగకుండా ఇది చూసుకుంటుంది. కాబట్టి కాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి. కాకరకాయ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి జీర్ణ క్రియను అరుగుదల విధానాన్ని అభివృద్ధి చేస్తాయి. దీనితో బరువు తగ్గడానికి వీలవుతుంది.కాకరకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది తేలికగా అరిగిపోతుంది. అరుగుదల కి మలబద్ధకానికి మరియు అజీర్తి సమస్యలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడే వారు రెగ్యులర్ గా తీసుకోండి.

డయాబెటిస్ తో బాధ పడే వాళ్లు కాకర తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. కాకర లో బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి వీటి కారణంగా డయాబెటిస్ రిస్కు తగ్గుతుంది.కాకరకాయ ఆకులు లేదా కాకరకాయను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలానే ఇది అంటు రోగాలు రానివ్వకుండా కూడా చూసుకుంటుంది. అంతే కాదండి లివర్ కి కూడా కాకరకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇలా కాకర వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

చూసారు కదా కాకర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది. అదే విధంగా న్యూట్రిషనిస్ట్ సింపుల్ చిట్కాలని కూడా చెప్పారు. ఇలా ఈ విధంగా కాకర జ్యుస్ ని తయారు చేసి తీసుకుంటే ఎన్నో సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. మందులకు బదులుగా అద్భుతమైన గుణాలు ఉండే కాకరని ఇలా చేసుకు తీసుకుంటే చక్కటి బెనిఫిట్స్ పొందడానికి వీలవుతుంది. దీంతో సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చు. కాకర తో శ్వాస సంబంధిత సమస్యలు మొదలు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. దీనితో ఇలా ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండచ్చు.