టోలీచౌకీలో భారీగా ట్రాఫిక్‌జామ్‌

Heavy traffic jam in tolichowki

గోల్కొండ పరిధిలోని షేక్‌పేట వద్ద జరుగుతున్న ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు చేస్తుండగా.. క్రేన్‌ మీద పడి డ్రైవర్‌ మృతి చెందాడు. దీంతో టోలీచౌకీలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.