టాలీవుడ్ లో అడుగు పెడుతున్న అర్జున్ కుమార్తె

టాలీవుడ్ లో అడుగు పెడుతున్న అర్జున్ కుమార్తె

హీరోల సుపుత్రుల‌తో పాటు, కుమార్తెలు కూడా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టి త‌మదైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. క‌మ‌ల్‌, శ‌ర‌త్ కుమార్‌, శ్రీ‌దేవి కుమార్తెలు ఈ రంగంలో త‌మ ప్ర‌తిభ చూపించారు, చూపిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ కుమార్తె వంతు వ‌చ్చింది. యాక్ష‌న్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న‌ అర్జున్ కి ఇద్ద‌రు కుమార్తెలు. అందులో త‌న పెద్ద‌ కుమార్తె ఐశ్వ‌ర్య అర్జున్‌ని క‌థానాయిక‌గా చేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. ఇది వ‌ర‌కు క‌న్న‌డ‌లో ఐశ్వ‌ర్య ఓ సినిమా చేసింది. కానీ స‌రైన ఫ‌లితం రాలేదు. తెలుగులో త‌న కుమార్తెని ప‌రిచ‌యం చేయాల‌ని అర్జున్ నిర్ణ‌యించుకున్నాడు. అందుకు ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రం చేశాడు. అర్జున్‌కి తెలుగులో చాలామంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌తో సాన్నిహిత్యం ఉంది. ఆ ప‌రిచ‌యాన్ని త‌న కుమార్తె కోసం వాడుకుంటున్నాడు. ఈ మ‌ధ్య ఐశ్వ‌ర్య హైద‌రాబాద్ వ‌చ్చింది. కొంత‌మంది ద‌ర్శ‌కుల్ని క‌లిసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఐశ్వ‌ర్య టాలీవుడ్‌లో రంగ ప్ర‌వేశం చేసేలా క‌నిపిస్తోంది. అయితే అర్జున్ ఓ పేరున్న హీరో ప‌క్క‌నే త‌న కూతుర్ని హీరోయిన్‌గా చూడాల‌ని భావిస్తున్నాడు. అవ‌స‌ర‌మైతే తానే నిర్మాత‌గా మారాల‌ని అనుకుంటున్నాడు.