ఓటిటి లోకి వచ్చేసిన “హీరో కార్తీ” సినిమా .. !

ఓటిటి లోకి వచ్చేసిన
Cinema News

కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ “జపాన్. ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ సినిమా కి రాజా మురుగన్ దర్శకత్వం వహించగా, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటుగా తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉన్నది.

ఓటిటి లోకి వచ్చేసిన "హీరో కార్తీ" సినిమా .. !
Japan Movie

ఈ సినిమా థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత ఓటిటి లోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌పై క్లారిటీ లేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించారు. సునీల్, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్, సనల్ అమన్, వాగై చంద్రశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కి సంగీతం జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.