నాని కారుకి యాక్సిడెంట్…

Hero Nani car accident at jubilee hills

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఎక్కడ బ్రేక్ లేకుండా దూసుకుపోతున్నాడు. అందుకేనేమో అతని కారు కూడా అతనిలాగే బ్రేక్స్ లేకుండా దూసుకోనిపోయి ప్రమాదానికి గురయ్యింది. వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో నాని కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళుతున్న నాని కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నాని డ్రైవర్‌ మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 3/పీడీపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు.