డ్రగ్స్‌ ఇష్యూపై రవితేజ తల్లి

Hero Ravi Teja mother respond on drugs case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రవితేజకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, ఆయన కెల్విన్‌ నుండి డ్రగ్స్‌ను ప్రతి వారం తీసుకుంటున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే రవితేజను విచారించేందుకు నోటీసులు అందించారు. నోటీసులను అందుకున్న రవితేజ ఈనెల 20న పోలీసుల ముందు హాజరు అయ్యి విచారణ ఎదుర్కోనున్నారు. రవితేజ డ్రగ్స్‌ తీసుకుని ఉంటాడని ఆయన అభిమానులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మద్య రవితేజ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రవితేజ డ్రగ్స్‌ మానేశాడు అనే వార్తలు వచ్చాయి. దాంతో రవితేజ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలోనే రవితేజ తల్లి రాజ్యలక్ష్మి మీడియా ముందుకు వచ్చి తన కొడుకు విషయమై మాట్లాడారు. తన కొడుకుకు కనీసం సిగరెట్‌ తాగే అలవాటు కూడా లేదని, సినిమాల కోసం తప్ప ఇంట్లో ఇప్పటి వరకు సిగరెట్‌ తాగలేదు అంటూ ఆమె పేర్కొంది. తన కొడుకు జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసేందుకు కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భరత్‌ మరణంపై కూడా ఆమె స్పందించారు. తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం భరత్‌ అంత్యక్రియలకు హాజరు కాలేదని, అంతే తప్ప మరేం లేదని, ఇక నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో భరత్‌ చనిపోయిన వెంటనే షూటింగ్‌లకు రవితేజ హాజరు అయ్యాడని ఆమె పేర్కొన్నారు. కొడుకు ఎంత చెడ్డవాడు అయినా కూడా తల్లికి ప్రేమే కదా, అందుకే రవితేజను ఆమె వెనకేసుకు వచ్చారు అంటూ కొందరు అంటున్నారు.

మరిన్ని వార్తలు: