హీరోయిన్‌ విషయంలో పొరపాటు చేసిన గోపీచంద్‌

gopichand speech in gautham nanda movie audio launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో హన్సిక, కేథరిన్‌లు జంటగా తెరకెక్కిన చిత్రం ‘గౌతమ్‌నంద’. ఈ చిత్రం విడుదలకు అంతా సిద్దం అయ్యింది. ఇక ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంను తాజాగా హైదరాబాద్‌లోని ఒక కన్వెన్సన్‌లో భారీగా చేశారు. ఈ సందర్బంగా గోపీచంద్‌ మాట్లాడుతూ కాస్త కంగారు పడ్డాడు. హీరోయిన్‌ పేరును తప్పుగా చెప్పి అందరికి షాక్‌ ఇచ్చాడు. ముఖ్యంగా ఆ హీరోయిన్‌ ఫేస్‌ ఆ సమయంలో మాడిపోయిన బల్బ్‌ మాదిరిగా అయ్యింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

ఇంతకు గోపీచంద్‌ ఏమన్నాడంటే.. ఈ చిత్రం తన కెరీర్‌లో చాలా కీలకమైనది. తనకు నటుడిగా ఈ సినిమా చాలా తృప్తిని ఇచ్చింది అంటూ గోపీచంద్‌ పేర్కొన్నాడు. ఆ సందర్బంగానే ఈ చిత్రంలో తనతో నటించిన తమన్నా, హన్సికలు తనకు ఎంతో మద్దతుగా నిలిచారు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడే గోపీచంద్‌ పక్కనున్న వ్యక్తి తమన్నా కాదు కేథరిన్‌ తెర్సా అంటూ హింట్‌ ఇచ్చాడు. దాంతో గోపీచంద్‌ తప్పును సరిదిద్దుకుని సారీ చెప్పి కేథరిన్‌ అంటూ తన స్పీచ్‌ను కొనసాగించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోపీచంద్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు, భారీ బిజినెస్‌ను జరుపుకున్న ఈ చిత్రంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. మరి కలెక్షన్స్‌ విషయంలో ఎలా ఉంటుంది అనేది చూడాలి.


మరిన్ని వార్తలు

డ్రగ్స్‌ జాబితాలో మెగా హీరో పేరు!

నేనేం మాట్లాడలేదు : పూరి

నాని ఖాతాలో మెగా హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డు